సీఎం కేసీఆర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రబీ ధాన్యం కొనుగోల్లపై స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ధాన్యం కొనుగోల్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలన్నారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం పెరుగుతూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తున్నాయని తెలిపినా కూడా ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందన్నరు. దీనిపై కేంద్ర మంత్రి షీయూష్ గోయల్‌ను కలిసి వివరించినా స్పందన లేదన్నారు.
2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలన్నారు. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న తరుణళంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.