సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయం : మంత్రి పువ్వాడ

CM KCR will secure hat-trick victory in next Assembly polls. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని

By Medi Samrat
Published on : 13 March 2023 9:06 PM IST

సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయం : మంత్రి పువ్వాడ

Puvvada Ajay Kumar


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతతో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మోడల్‌గా నిలిచిన తెలంగాణ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందనుందని అన్నారు. తన స్వార్థ రాజకీయ అవసరాల కోసం.. తప్పుడు ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై పువ్వాడ అజయ్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి పొంగులేటికి లేదని అన్నారు. ఖమ్మంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించాలని, ఖమ్మం అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని శ్రీనివాస్‌రెడ్డికి పువ్వాడ అజయ్‌ సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రస్తావిస్తూ.. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఖమ్మం, పొరుగు జిల్లాల్లోని భూములకు గోదావరి జలాలతో సాగునీరు అందిస్తామని చెప్పారు.


Next Story