రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు భూమిపూజ..
CM KCR Will Lay Foundation Stone to TRS Party Office In Delhi. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరగనుంది. రేపు మధ్యాహ్నం
By Medi Samrat Published on
1 Sep 2021 1:32 PM GMT

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరగనుంది. రేపు మధ్యాహ్నం 1:48 గంటలకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకై బుధవారం ఉదయం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ మేరకు వసంత్ విహార్‌లో పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ దక్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాలయం లేదని.. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకుంటున్న తొలి దక్షిణాది పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంత్రుల వెంట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
Next Story