రేపు 8 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్

CM KCR will inuagurate 8 medical colleges. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి మెరుగైన వైద్యం అందించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప్ర‌తి జిల్లాకో మెడిక‌ల్ కాలేజీని

By Medi Samrat  Published on  14 Nov 2022 7:01 PM IST
రేపు 8 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి మెరుగైన వైద్యం అందించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప్ర‌తి జిల్లాకో మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో నూత‌నంగా నిర్మించిన 8 మెడిక‌ల్ కాలేజీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 మెడిక‌ల్ కాలేజీల్లో విద్యాబోధ‌న త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌నున్నారు. త‌ద్వారా సంగారెడ్డి, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, వ‌న‌ప‌ర్తి, కొత్త‌గూడెం, నాగ‌ర్‌క‌ర్నూల్‌, రామగుండంలో మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఎంబీబీఎస్ తొలి విద్యా సంవ‌త్స‌రం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.


Next Story