రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

CM KCR Visits Yadadri Tomorrow. రేపు (మంగళవారం, 19 అక్టోబర్) యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

By Medi Samrat  Published on  18 Oct 2021 1:29 PM IST
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

రేపు (మంగళవారం, 19 అక్టోబర్) యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీంటిని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.


Next Story