యాదాద్రికి చేరుకున్న కేసీఆర్.. మ‌రికాసేప‌ట్లో..

CM KCR Visits Yadadri Temple. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి సోమవారం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ

By Medi Samrat  Published on  28 March 2022 5:06 AM GMT
యాదాద్రికి చేరుకున్న కేసీఆర్.. మ‌రికాసేప‌ట్లో..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి సోమవారం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో యాదాద్రి చేరుకున్నారు. కాసేప‌ట్లో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ప్రారంభం కానుంది. కేసీఆర్ కుటుంబ స‌మేతంగా స్వయం‌భు‌వుల తొలి పూజలో పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు ఆల‌య ప్ర‌వేశం జ‌ర‌గ‌నుంది. స్వ‌ర్ణ ధ్వ‌జ‌స్తంభ సంద‌ర్శ‌న ప్రారంభించ‌నున్నారు. సాయంత్రం 3 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు సీఎం తిరిగి ప‌య‌న‌మ‌వుతారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆలయ విస్తరణ నిర్మాణం చేపట్టడంతో ఏడేళ్ల తర్వాత స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. యాదాద్రి మూలమూర్తుల దర్శనభాగ్యం కోసం చూస్తున్న చూడాలన్న భక్తుల ఏడేళ్ల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. గత ఆరేళ్లలో బాలాలయంలో సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని భావిస్తూ ఉన్నారు.


Next Story
Share it