CM KCR Visits Districts. సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన ముగిసింది. దీంతో ఆయన పాల్గొనబోయే అధికారిక
By Medi Samrat Published on 15 Dec 2021 1:09 PM GMT
సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన ముగిసింది. దీంతో ఆయన పాల్గొనబోయే అధికారిక కార్యక్రమాల షెడ్యూల్ ఖరారయ్యింది. మొదటగా.. డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.
ఈ నెల 18న దళిత బంధు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. ఇక ఈ నెల 19న సీఎం కేసిఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. పర్యటనలో జనగామ జిల్లా కేంద్రంలోని సమీకృత సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.