సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రోడ్డుమార్గంలో వాసాలమర్రి గ్రామానికి చేరుకోనున్నాకరు. అక్కడ గ్రామస్థులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లుచేశారు. అనంతరం గ్రామస్థులతో సమావేశంలో పాల్గొననున్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇంతకుముందు ఆ గ్రామ సర్పంచ్‌కు కూడా ఫోన్ చేసి మాట్లాడారు.
ఇక సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు. ఇదిలావుంటే.. వాసాలమర్రి గ్రామస్తులే సీఎం కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ప్రత్యేకంగా పాస్‌లను జారీచేశారు.