హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు. అంబేద్కర్ విగ్రహా శిలాఫలకాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు.
అంతకుముందు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్‌ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ భోజనం చేశారు. అనంతరం విగ్రహావిష్కరణ కోసం ప్రగతి భవన్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరారు.