రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్

CM KCR To Visit Vasalamarri Tomorrow. తెలంగాణ‌ సీఎం కేసీఆర్ బుధవారం వాసాలమర్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. రేపు ఉదయం పదకొండు

By Medi Samrat  Published on  3 Aug 2021 11:55 AM GMT
రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ బుధవారం వాసాలమర్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు వాసాలమర్రికి చేరుకుంటారు. వాసాలమర్రిలో రైతు వేదిక భవనంలో గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశమవుతారు. గ్రామ అభివృద్ధిపై గ్రామ కమిటీల నుంచి సీఎం వివరాలు తెలుసుకోనున్నారు. ‌రైతు వేదిక సమావేశం అనంతరం ఎస్సీ కాలనీలో కేసీఆర్ పర్యటిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం.. హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు. వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్‌ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలావుంటే.. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అక్కడ గ్రామసభ నిర్వహించారు. మరో 20 సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం గత నెలలో పర్యటనకు సిద్ధం కాగా.. వర్షాల కారణంగా రద్దైంది. దీంతో సీఎం కేసీఆర్ రేపు వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్నారు.


Next Story
Share it