సంగారెడ్డిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR to visit Sangareddy in February. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు

By Medi Samrat  Published on  29 Jan 2022 5:05 AM GMT
సంగారెడ్డిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలో పర్యటించనున్నారు. ఈ మేర‌కు శుక్రవారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య‌క్షుడు చింతా ప్రభాకర్‌ ముఖ్యమంత్రిని కలిశారు. సంగారెడ్డి పర్యటనలో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (SLIP), బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (BLIP)లకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

సంగారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్) కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. జిల్లాలోని రాయికోడ్ మండలంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పర్యటనలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన తర్వాత ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్‌, కె. మాణిక్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, ఇతర నాయకులు బహిరంగ సభ నిర్వహణకు స్థలాన్ని గుర్తించేందుకు రాయికోడ్‌ మండలంలో పర్యటించారు.


Next Story
Share it