14న కొండ‌గ‌ట్టుకు సీఎం కేసీఆర్‌..!

Cm KCR to Visit Kondagattu On Feb 14th. ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పర్యటన ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 11 Feb 2023 9:25 PM IST

14న కొండ‌గ‌ట్టుకు సీఎం కేసీఆర్‌..!

ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పర్యటన ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. ఇటీవల కొండగట్టు అంజయనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హెలిప్యాడ్ ను పరిశీలించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రముఖ ఆర్కిటెక్చ‌ర్‌ ఆనంద్ సాయి కూడా రేపు కొండగట్టు వెళ్ల‌నున్నారు. ఆనంద్ సాయి కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించిననున్నార‌ని స‌మాచారం.


Next Story