సిద్ధిపేట.. తెలంగాణ సాధించిన పేట : సీఎం కేసీఆర్

CM KCR Speech In Siddipet Meeting. సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలలో

By Medi Samrat  Published on  10 Dec 2020 4:56 PM IST
సిద్ధిపేట.. తెలంగాణ సాధించిన పేట : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలలో పాల్గొన్న ఆయ‌న‌.. అనంత‌రం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గౌండ్ లో జ‌రిగిన‌ భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సిద్దిపేట‌పై, మంత్రి హరీష్ రావుపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.

సిద్ధిపేట అంటే నాకు ప్రాణం. ఉద్యమ సమయం నుంచి ఇప్పటిదాకా సిద్ధిపేట నాకు అండగా ఉంది. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడని.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. సిద్ధిపేటలోనే ఏదో బలం ఉందని.. తెలంగాణ సాధించిన పేట అన్నారు. సిద్ది పొందిన పేట అని ప్రసిద్ధి అని తెలిపారు. అందుకే.. సిద్ధిపేటకు తనలా పనిచేసే ఆణిముత్యం లాంటి హరిష్‌ను ఇచ్చానని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిద్ధిపేట ఇండియాకు రోల్ మోడల్ గా మారుతుందని అన్నారు.

ఆరేళ్ళ కాలంలో కరెంటు బాధలు, నీళ్ల బాధలు పోయాయని.. సిద్ధిపేట స్కీమే రాష్ట్రానికి విస్తరించిందని, దానిపేరే మిషన్ భగీరథ అని అన్నారు. రంగనాయక సాగర్ ను టూరిస్ట్ హబ్ గా తీర్చి దిద్దుతామని అన్నారు. సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కావాలని కోరార‌ని.. తప్పకుండా వాటిని సిద్దిపేటకు మంజూరు చేస్తామని కేసీఆర్‌ అన్నారు. అలాగే.. సిద్ధిపేట-కుకునూర్ ప‌రిధి వరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటు.. నూత‌నంగా ప్రారంభించిన‌ సిద్ధిపేట డబల్ బెడ్‌రూం కాలనీకి బస్తీ దవాఖానను కూడా సీఎం మంజూరు చేశారు.


Next Story