నిజామాబాద్ అభివృద్ధిపై ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

CM KCR Review Meeting On Nizamabad Development. నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం,

By Medi Samrat
Published on : 27 Nov 2022 3:27 PM IST

నిజామాబాద్ అభివృద్ధిపై ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం.. అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ , డైరక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర తో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవిన్యూ, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story