ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR Reaches Delhi. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ

By Medi Samrat  Published on  1 Sep 2021 2:55 PM GMT
ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేఫ‌థ్యంలో భూమి పూజ కార్యాక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరావు, వెంకటేశ్‌ నేత, సురేశ్‌రెడ్డి, బండ ప్రకాశ్‌ తదితరులు సీఎం కేసీఆర్‌ దంపతులకు స్వాగతం పలికారు.

ఇదిలావుంటే.. పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేంద్రం ఢిల్లీలోని వసంత్ విహార్‌ మెట్రో స్టేషన్ సమీపంలో 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. గతేడాది నవంబరు 4న కేంద్రం టీఆర్ఎస్‌కు భూమిని అప్పగించింది. అయితే.. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా వేచి ఉన్న కేసీర్‌.. రేపు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.


Next Story
Share it