న‌ల్గొండలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం కేసీఆర్‌.. టూర్ వివ‌రాలివే..

CM KCR Nalgonda Tour. సీఎం కేసీఆర్ నేడు న‌ల్గొండ‌ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 11:45 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో న‌ల్గొండ‌‌కు బ‌య‌ల్దేర‌నున్నారు.

By Medi Samrat  Published on  10 Feb 2021 4:30 AM GMT
CM KCR Nalgonda Tour

సీఎం కేసీఆర్ నేడు న‌ల్గొండ‌ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 11:45 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో న‌ల్గొండ‌‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12:30 నందికొండ‌కు చేరుకోనున్నారు. అక్క‌డ్నుంచి 12:40 గంట‌ల‌కు రోడ్డుమార్గాన నెల్లిక‌ల్లుకు వెళ్ల‌నున్నారు. 12:45 గంట‌ల‌కు నెల్లిక‌ల్లులో 13 లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఒకే చోట శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

అనంత‌రం 12:55 గంట‌ల‌కు నాగార్జున‌సాగ‌ర్ చేరుకుంటారు. ఒంటిగంట‌కు హిల్ కాల‌నీలోని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ భోజ‌నం చేస్తారు. ఆ త‌ర్వాత‌ మ‌ధ్యాహ్నం 3:10 గంట‌ల‌కు హాలియాలో జ‌రుగ‌నున్న‌‌ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని సీఎం ప్ర‌సంగించ‌నున్నారు. సాయంత్రం 4:10 గంట‌ల‌కు కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరుగు ప‌య‌నం కానున్నారు.


Next Story
Share it