బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

CM KCR Meets With Balka Suman. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధ‌వారం మెట్‌పల్లిలోని

By Medi Samrat  Published on  9 Jun 2021 7:53 PM IST
బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధ‌వారం మెట్‌పల్లిలోని రేగుంటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రేగుంట నుంచి సీఎం రోడ్డు మార్గాన హైదరాబాద్‌ బయల్దేరారు.

మెట్‌పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బాల్క సురేష్‌(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు. బాల్క సురేష్ మృతి ప‌ట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయ‌కులు ఇప్ప‌టికే త‌మ‌ సంతాపం తెలియ‌జేశారు. బాల్క సుమన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ నేఫ‌థ్యంలో సీఎం కేసీఆర్ నేడు సుమన్‌ను పరామర్శించారు.


Next Story