కిలో వడ్లు కూడా కొనలేం.. రైతాంగాన్ని కాపాడాలంటే అలా చేయండి : కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌

CM KCR Meet With District Collectors. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని

By Medi Samrat  Published on  18 Dec 2021 12:16 PM GMT
కిలో వడ్లు కూడా కొనలేం.. రైతాంగాన్ని కాపాడాలంటే అలా చేయండి : కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని సీఎం కేసీఆర్ మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం అన్నారు. వీటిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్లను, వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.


Next Story