సమయం వచ్చినప్పుడు తప్పకుండా దళితుడిని సీఎం చేస్తాం: కేసీఆర్

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక విషయాలపై చర్చించారు.

By Medi Samrat  Published on  18 Nov 2023 4:00 PM GMT
సమయం వచ్చినప్పుడు తప్పకుండా దళితుడిని సీఎం చేస్తాం: కేసీఆర్

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక విషయాలపై చర్చించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో విజయం సాధించిందని, కొత్త రాష్ట్రం కావడంతో ఎమ్మెల్యేలంతా తననే సీఎంగా ఉండాలని కోరారని, అందుకే బాధ్యతలు చేపట్టానని తెలిపారు. దళిత సీఎం వాగ్దానంపై తాము వెనక్కి తగ్గలేదని.. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తీరుతామని చెప్పారు. మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అన్నది నిజమేనని, ఆ విషయాన్ని ఆయన నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం తప్పన్నారు కేసీఆర్.

కేంద్ర, రాష్ట్ర సంబంధాల నేపథ్యంలో తరుచూ ప్రధానిని కలిసేవాడినని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్డీఏలో జాయిన్ కావాలని మోదీ అడిగారని, తెలంగాణ కోసం ఏదైనా చేయాలని షరతు పెట్టానని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో తాను యాభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానని, తన వయస్సు 70కు చేరగానే రిటైర్మెంట్ తీసుకుంటానని తెలిపానని కేసీఆర్ చెప్పారు. ఆ వెంటనే కేటీఆర్ గురించి ఆరా తీశారు. మీరు ప్రధానమంత్రి.. మీ ఆశీస్సులు అందించాలి.. కేటీఆర్ కు సహకరించాలని చెప్పానన్నారు. ఇలాంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై వెల్లడించడం ప్రధానికి తగదన్నారు సీఎం కేసీఆర్.

Next Story