మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ సమీపంలో నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావును కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మానవతా దృక్పథంతో ప్రభుత్వ పథకాల అమలులో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న కంటి వెలుగు రెండో విడత పథకంలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పేదలకు, నిరుపేదలకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా వారు నూతనోత్సాహంతో పని చేయాలని ఆయన కోరారు.
ఏడేళ్ల క్రితం 60వేలకోట్ల రూపాయల బడ్జెట్ ఉండే తెలంగాణ.. నేడు 2.50లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టే వరకు రాగలిగాం. మనలాగా ఈ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి ఎవరూ సాహసించరు'' అని చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్ నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాల మధ్య మహబూబ్‌నగర్ పట్టణంలో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళ్లారు.