గుడ్‌న్యూస్ : తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలకు స్పెషల్‌ పర్మిషన్‌

CM KCR Good News To Drinkers. తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు

By Medi Samrat  Published on  28 Dec 2021 1:42 PM GMT
గుడ్‌న్యూస్ : తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలకు స్పెషల్‌ పర్మిషన్‌

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్ర‌కారం.. కోవిడ్-19 యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP)కి లోబడి.. వాడుకలో ఉన్న నిబంధనలను సడలిస్తూ.. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వబడిందని పేర్కొంది. అలాగే బార్స్‌, ఈవెంట్స్‌, పబ్‌లకు అర్దరాత్రి ఒంటిగంటకు వరకు అనుమతి ఇచ్చింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల పేరిట సడలింపులు ఇవ్వడం విశేషం.

Next Story
Share it