Telangana : ఆర్టీసీ ఉద్యోగులు.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులే

CM KCR Good News For Telangana RTC employees. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

By Medi Samrat
Published on : 31 July 2023 3:10 PM

Telangana : ఆర్టీసీ ఉద్యోగులు.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులే

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు . ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో కూడిన ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 40 నుంచి 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో జరిగిన నష్టంపై క్యాబినెట్‌లో ప్రధానంగా చ‌ర్చ జరిగింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతోపాటు రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 3వేల కోట్ల నష్టం జరిగినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


Next Story