తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం వారణాసికి పర్యటనకు వెళ్లింది. రెండు రోజుల పాటు సీఎం కుటుంబ సభ్యులు అక్కడ పర్యటించనున్నారు. సీఎం సతీమణి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు ఉత్తర ప్రదేశ్‌లోని వారు వారణాసిలో పర్యటిస్తారు.
పర్యటనలో బాగంగా ముందుగా అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అస్సి ఘాట్ కు బోట్లో తిరుగు ప్రయాణం అవుతారు. ఆపై సంకత్మోచన్ దేవాలయాన్ని దర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించుతారు. ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల వారణాసి పర్యటన ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.