రేపు సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

CM KCR Delhi tour tomorrow.తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టారు. కేంద్రంలోని బీజేపీతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 1:24 PM IST
రేపు సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టారు. కేంద్రంలోని బీజేపీతో పోరాడేందుకు ప్ర‌యత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా కొనసాగుతున్న కొన్ని రాజకీయ పార్టీల నేతలు కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడటమే కాకుండా భవిష్యత్తు రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల‌ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయి వచ్చారు. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ వంటి నేత‌ల‌ను క‌లిశారు

హస్తిన వేదికగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరపడం కాకుండా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కావాలని ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల‌ని బావించారు. అయితే.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది. రేపు(శుక్ర‌వారం) ఆయ‌న ఢిల్లికి వెళ్ల‌నున్నారు. ఆయ‌న వెంట తెలంగాణ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, ప‌లువురు నేత‌లు ఢిల్లికి వెళ్ల‌నున్నారు అని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

Next Story