మంత్రి గంగులను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

CM KCR Consolate Minister Gangula Kamalakar and his family. బీసీ సంక్షేమం , ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు

By Medi Samrat
Published on : 16 Jan 2023 3:12 PM IST

మంత్రి గంగులను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

బీసీ సంక్షేమం , ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించారు. కరీంనగర్ లో సోమవారం ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మంత్రి గంగులను , కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.


Next Story