ఎమ్మెల్సీ ఎన్నికలు.. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్
CM KCR assigned key responsibilities to the ministers. తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ
By Medi Samrat Published on 27 Feb 2021 1:36 PM IST
తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సంవత్సరం దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ రాకపోవడం తో ఈ ఎన్నికల్లో అయిన తమ అభ్యర్థులను దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెక్ పెట్టాలని ఇతర పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా, మరోవైపు ఇతర విపక్షాలు,ఇండిపెండెంట్లు సైతం రంగంలో ఉండటంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పట్టభద్రుల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. అంతేకాదు ఈ ఎన్నికల సందర్భంగా మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత పలువురు మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డికి మంత్రి హరిష్ రావు, హైదరాబాద్ కు గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యత పలువురు మంత్రులకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆ బాధ్యతలను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పట్టభద్రులు తప్పకుండా గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బే తగిలింది. అలాగే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ కేటాయించిన అభ్యర్థులు సైతం గెలువలేకపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు తప్పకుండా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి పని చేయాలని, లేకపోతే ఊరుకునేది లేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థులు తప్పకుండా గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది టీఆర్‌ఎస్.
నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.