తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఏ జిల్లాలో ఎన్ని, క్యాడర్, శాఖల వారీగా వివరాలు ఇవే
CM KCR announces zonal wise Districts wise vacancies.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు
By తోట వంశీ కుమార్ Published on 9 March 2022 6:23 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు ఈరోజే నోటిఫికేషన్‌న్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 11.103 కాంట్రాక్టు ఉద్యోగలను రెగ్యులరైజ్ చేయనున్నట్లు చెప్పారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని.. ఐదుశాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు.
వయో పరిమితి పెంపు
ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పదేళ్లకు పెంచింది. ఓసీ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు 47 ఏళ్లు వరకు వయోపరిమితి పెంచారు.
ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా..
జిల్లాల్లో - 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147
క్యాడర్ వారీగా ఖాళీలు
గ్రూప్ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్ 2- 582 ఉద్యోగాలు
గ్రూప్ 3 – 1,373 ఉద్యోగాలు
గ్రూప్ 4- 9168 పోస్టులు
జిల్లాల వారీగా ఖాళీలు
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556
జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866 పోస్టులు మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి
జోన్లు..
కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్- 2,328
రాజన్న జోన్- 2,403
భద్రాద్రి జోన్- 2,858
యాదాద్రి జోన్- 2,160
చార్మినార్ జోన్- 5,297
జోగులాంబ జోన్- 2,190
మల్టీజోన్లు..
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370
శాఖల వారీగా ఖాళీల వివరాలు..
- హోం శాఖ - 18,334
- సెకండరీ ఎడ్యుకేషన్ - 13,086
- హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ - 12,755
- హయ్యర్ ఎడ్యుకేషన్ - 7,878
- బీసీల సంక్షేమం - 4,311
- రెవెన్యూ శాఖ - 3,560
- ఎస్సీ వెల్ఫేర్ శాఖ - 2,879
- నీటిపారుదల శాఖ - 2,692
- ఎస్టీ వెల్ఫేర్ - 2,399
- మైనారిటీస్ వెల్ఫేర్ - 1,825
- ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ - 1,598
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ - 1,455
- లేబర్, ఎంప్లాయీమెంట్ - 1,221
- ఆర్థిక శాఖ - 1,146
- మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ - 895
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ - 859
- అగ్రికల్చర్, కో-ఆపరేషన్ - 801
- రవాణా, రోడ్లు, భవనాల శాఖ - 563
- న్యాయశాఖ - 386
- పశుపోషణ, మత్స్య విభాగం - 353
- జనరల్ అడ్మినిస్ట్రేషన్ - 343
- ఇండస్ట్రీస్, కామర్స్ - 233
- యూత్, టూరిజం, కల్చర్ - 184
- ప్లానింగ్ - 136
- ఫుడ్, సివిల్ సప్లయిస్ - 106
- లెజిస్లేచర్- 25
- ఎనర్జీ - 16
ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్
ఇప్పటి నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేసి.. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయని తెలిపారు. తద్వారా నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా నియామక పరీక్షల మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.