హుజూరాబాద్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌

CM KCR Announces Huzurabad Candidate For ByPoll. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. తెలంగాణ ఉద్యమంలో

By Medi Samrat  Published on  11 Aug 2021 6:52 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగ‌నున్న‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ ప్రస్తుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో అంకితభావంతో, ధీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్ధిగా మాజీమంత్రి ఈటెల రాజేంద‌ర్‌ బ‌రిలో ఉండ‌గా.. మ‌రో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించాల్సివుంది.


ఇదిలావుంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రుగ‌నున్న నేఫ‌థ్యంలో నియోజకవర్గ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత‌లంతా టీఆర్ఎస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లో చేరిన యువ‌నేత‌ కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు సీఎం కేసీఆర్‌. గత నెలలో కాంగ్రెస్‌ పార్టీని వీడిన పాడి కౌశిక్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ యువ నాయకుడు పాడికౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తును రాజకీయంగా అందిస్తామని ప్రకటన చేశారు. మాట ఇచ్చిన‌ట్లుగానే కేసీఆర్ 15 రోజుల్లోనే కౌశిక్‌ను ఎమ్మెల్సీని చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


Next Story
Share it