వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయ‌డానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది : సీఎం కేసీఆర్‌

CM KCR About Non-Agriculture Properties. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం

By Medi Samrat
Published on : 23 Nov 2020 7:53 AM IST

వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయ‌డానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది : సీఎం కేసీఆర్‌

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని సీఎం వెల్లడించారు.


Next Story