రాజమౌళికి చికోటి ప్రవీణ్ హెచ్చరికలు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ విమర్శలు గుప్పించారు.

By -  Medi Samrat
Published on : 19 Nov 2025 7:40 PM IST

రాజమౌళికి చికోటి ప్రవీణ్ హెచ్చరికలు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ విమర్శలు గుప్పించారు. రాజమౌళీ, హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. నీ సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలని అన్నారు. రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే హిందూ ద్రోహిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. ఆయన అద్భుతమైన దర్శకుడు అనే ఉద్దేశంతో అందరూ అభిమానిస్తారని అన్నారు. కానీ ఒక్క ప్రకటనతో హిందూ సమాజంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దేవుడిని నమ్మకుంటే తమకు వచ్చిన సమస్య ఏమీ లేదని, కానీ విమర్శించడం సరికాదని అన్నారు. మీ ప్రతి సినిమాకు ముందు దేవుడికి పూజ చేసి ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావో చెప్పాలని ప్రశ్నించారు.

అహంకారంతో విర్రవీగే భల్లాలదేవ చివరకు ఎలా పతనమయ్యాడో నీ సినిమా బాహుబలిలోనే చూపించావు... ఈరోజు నీవు అదే అహంకారంతో ప్రవర్తిస్తే నీ పతనం ఖాయమని హెచ్చరించారు.

Next Story