ఆ సందర్భం వస్తుంది.. అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలి

మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం తెలంగాణకు గొప్ప కీర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  8 March 2025 7:45 PM IST
ఆ సందర్భం వస్తుంది.. అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలి

మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం తెలంగాణకు గొప్ప కీర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఈ యూనివర్సిటీ పోటీ పడాలన్నారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి రాజీవ్ గాంధీ కలల్నినిజం చేయాలన్నారు. ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుంది.. అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నాన‌న్నారు. మహిళలకు అవకాశం ఇస్తే తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఆదర్శంగా నిలబడుతున్నారన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టం.. మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించాం.. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు.. వారు వ్యాపారవేత్తలుగా రాణిస్తారని ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందన్నారు. అదానీ, అంబానీలతో వ్యాపారంలో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నామ‌న్నారు. రెండున్నరేళ్లలో యూనివర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.. నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది.. చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకిరావాల్సిన బాధ్యత మీది అని విద్యార్ధుల‌కు సూచించారు.

Next Story