చత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు.ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ విగ్రహం పనులు పూర్తయి విగ్రహావిష్కరణకు సిద్ధంగా ఉంచారు.
ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడ్డ ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.