కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

Cheruku Sudhakar Joined In Congress Party. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

By Medi Samrat  Published on  5 Aug 2022 5:10 PM IST
కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖ‌ర్కే.. చెరుకు సుధాకర్ కు పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కార్య‌క్ర‌మంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు నాయ‌కులు బ‌త్తుల సోమ‌య్య‌, సందీప్ త‌దిత‌రులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. మునుగొడు లో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లినా.. కార్యకర్తలు మాత్రం పార్టీ ఉంటే ఉన్నారని అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని తెలిపారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మునుగోడులో గెలవడానికి తన వంతు సహాయ సహకారాలు అందించినట్లుగా చెరుకు సుధాకర్ తెలిపారు.


Next Story