మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దుబ్బాక జరిగిన దాడిని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియా మాట్లాడుతూ.. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో సరైంది కావని అన్నారు. 2018లో నాగేశ్వర్‌రావుతో దిగిన ఫొటోలు ఉన్నాయని.. 2020లో ప్రెస్ రిపోర్టర్‌గా ఉన్నాడని వెల్లడించారు. దాడి జరిగిన గంటలోపే ముఖ్యమంత్రి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. సిద్దిపేట సూపర్ స్పెషలిటీకి కాకుండా బీఆర్ఎస్ కనుసన్నల్లో నడిచే యశోదకి తీసుకెళ్లడం అనుమానస్పదం కలిగిస్తుందని అన్నారు. దుబ్బాక బంద్ ప్రకటిస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తికి దళిత బంధు రాలేదని.. ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు రాలేదని.. మద్యం తాగి ఉన్నాడని చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తికి కాంగ్రెస్‌తో సంబంధం లేదన్నారు. ఫోటోలో కనిపిస్తున్నవారు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరని.. బీఆర్ఎస్‌లో ఉన్నారని అన్నారు.