Telangana : పోలీసు నియామక తుది పరీక్షా తేదీల్లో మార్పులు

Changes in Police Recruitment Final Exam Dates. పోలీసు నియామక తుది పరీక్షా తేదీల్లో మార్పు చేసినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.

By Medi Samrat
Published on : 13 Jan 2023 6:44 PM IST

Telangana : పోలీసు నియామక తుది పరీక్షా తేదీల్లో మార్పులు

పోలీసు నియామక తుది పరీక్షా తేదీల్లో మార్పు చేసినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్(జనరల్), కానిస్టేబుల్(ఐటీ విభాగం) రాత పరీక్ష తేదీని 30వ తేదీకి మార్చినట్టు తెలిపింది. మార్చి 12న జరగాల్సిన ఏఎస్సై ఫింగర్ ప్రింట్స్, ఎస్సై (ఐటీ) పరీక్షా తేదీని ఒకరోజు ముందుగా మార్చి 11వ తేదీనే నిర్వహించనున్నట్టు తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఈ పరీక్షల తేదీలను మార్చుతూ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా ప్రకటన చేసింది. సబ్ ఇన్ స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలు మార్చి 12 నుంచి మార్చి 11వ తేదీకి మార్చామని.. ఒకరోజు ముందుకు జరిపామని అధికారి తెలిపారు. కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ మేరకు మార్పులు చేసింది.


Next Story