మునుగోడు పాలిటిక్స్ : కొందరు వస్తున్నారు.. మరికొందరు వీడుతున్నారు

Chanduru Congress Key Leader Join in TRS. మునుగోడు నియోజ‌కవ‌ర్గ కేంద్రం చండూరు మండ‌ల ప‌రిష‌త్ చైర్‌పర్స‌న్‌గా కొన‌సాగుతున్న క‌ల్యాణి

By Medi Samrat  Published on  15 Oct 2022 11:19 AM GMT
మునుగోడు పాలిటిక్స్ : కొందరు వస్తున్నారు.. మరికొందరు వీడుతున్నారు

మునుగోడు నియోజ‌కవ‌ర్గ కేంద్రం చండూరు మండ‌ల ప‌రిష‌త్ చైర్‌పర్స‌న్‌గా కొన‌సాగుతున్న క‌ల్యాణి త‌న భ‌ర్త ప‌ల్లె ర‌వి కుమార్‌తో క‌లిసి టీఆర్ఎస్ గూటికి చేరారు. గతంలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన ప‌ల్లె ర‌వికుమార్ ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. మునుగోడులో కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా ఎదిగారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆయ‌న ఆశించారు. స‌ర్వేలో ఆయ‌న వెనుక‌బ‌డ‌టంతో టికెట్ ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ నేత‌లు నెర‌పిన మంత్రాంగంతోఎంపీపీగా ఉన్న త‌న స‌తీమ‌ణితో క‌లిసి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ప‌ల్లె ర‌వి దంప‌తుల‌ను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

టీఆర్‌ఎస్‌కు కూడా షాక్‌ తలిగింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని.. పైరవీలు చేసే వ్యక్తిని కాదని తెలిసినా.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు.


Next Story
Share it