ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ అంబర్ పేట్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మంద కృష్ణ మాదిగను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయ‌న‌ కుటుంబం సభ్యులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంద కృష్ణ‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ కాలికి గాయం కావడం దురదృష్టకరమ‌ని అన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారని.. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల‌ బాత్‌‌రూంలో కాలు జారి పడ‌డంతో మంద కృష్ణ‌కు.. బోన్‌‌ ఫ్రాక్చర్ అయ్యింది. చికిత్స తీసుకున్న అనంత‌రం రెస్ట్ తీసుకుంటున్నారు. మంద కృష్ణ‌ను ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కూడా క‌లిసి ప‌రామ‌ర్శించారు. త్వ‌ర‌గా కోలుకుని ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని అభిల‌షించారు.


సామ్రాట్

Next Story