పంచాయతీ ఎన్నికలపై అప్‌డేట్..రిజర్వేషన్లపై నేడు జీవో రిలీజ్‌కు ఛాన్స్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది.

By -  Knakam Karthik
Published on : 22 Nov 2025 7:33 AM IST

Telangana, local body elections, Telangana Government, High Court, State Election Commission

పంచాయతీ ఎన్నికలపై అప్‌డేట్..రిజర్వేషన్లపై నేడు జీవో రిలీజ్‌కు ఛాన్స్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మరో వైపు రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండేలా కొత్త రిజర్వేషన్లపై నివేదికను డెడికేటెడ్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం మంత్రుల వద్దకే ఫైలును పంపించి ఆమోదం తెలుపుతూ సంతకాలు తీసుకున్నారు. దీనితో గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీలు, వార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై విధివిధానాలు తయారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచి పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయిస్తారు.

శని, ఆదివారాల్లో జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఎన్నికల ఏర్పాట్లు చేస్తునపుట్లు ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి, విచారణ ముగించాలని కోరనుంది. హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూలు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.

Next Story