కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
By Medi Samrat Published on 11 March 2024 2:41 PM ISTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డా.. కేటీఆర్ మా ముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్లు మాట్లాడుతావా..? కేటీఆర్ ..మా రేవంత్ రెడ్డి పైన మాట్లాడే స్థాయి నీకుందా..? నీ భాష మార్చుకోకపోతే బట్టలూడదీసి ఉరికిస్తాం అంటూ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ ముసుగులోఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర మీదన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందని జోష్యం చెప్పారు.
రూ.100 కోట్లు ఆఫర్ చేసినా పోటీ చేయడానికి మీకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదన్నారు. 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి అసలు అభ్యర్థులే లేరన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. కేటీఆర్.. నీ అయ్య కేసీఆర్ ఎవరి బూట్లు నాకి ముఖ్యమంత్రి అయ్యాడు..? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు వరకు గెలిచిన చరిత్ర మా రేవంత్ రెడ్డిది. స్వతంత్రంగా జడ్పీటీసీగా, ఎంఎల్సీగా గెలిచిన చరిత్ర మా రేవంత్ రెడ్డిది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలఆశ్వీరాధంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చీమలు పెట్టిన పుట్టలోపాములు దూరినట్లు సిరిసిల్ల లో కేటీఆర్ దొంగలా దూరాడన్నారు.
కేటీఆర్ మొగోడివైతే ఎంపీఎన్నికల్లో సిరిసిల్లలో మెజారిటీ తెచ్చి చూపించని సవాల్ విసిరారు. కేటీఆర్ కు సిరిసిల్లలో నూకలు చెల్లాయి.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అక్కడ మూడోస్థానమేనన్నారు. కేటీఆర్.. నీ భాష మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. జూన్ లో బీఆర్ఎస్ పార్టీతట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనన్నారు.
వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే
అమెరికాలో బాత్రూంలు కడిగినవచ్చిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుడనని చెప్పుకుంటున్నాడని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో నీ జాడ ఎక్కడ..? పదేళ్లు దోచుకొని తిన్నది అరగక నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నావని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారెంటీలు అమలుఅవుతుండటం ఓర్వలేక మతి భ్రమించి మా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ముఖ్యమంత్రి పైన కేటీఆర్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఎవరి బూట్లు నాకీ అధికారంలోకి వచ్చాడు..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అవుతుందనే ఆందోళనతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలిపించుకోవాలయని సవాల్ విసిరారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. లేకుండా ప్రజలు తెలంగాణలో తిరగనివ్వరని హెచ్చరించారు.