రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

By Medi Samrat
Published on : 19 July 2025 4:37 PM IST

రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమి మరియు అందులో నిర్మించిన భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. యాచారం మండల కేంద్రంలోని 2 వేల గజాల భూమిని వ్యవసాయ శాఖ కు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి భూమికి సంబందించిన పత్రాలను అందించారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 4 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. నెలరోజుల క్రితమే రైతు కమిషన్ బృందం, వ్యవసాయ అధికారులు కలిసి యాచారం మండలంలో పర్యటించారు. ఆ సమయంలో కోదండరెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్న భూమిని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి తోపాటు మార్కెటింగ్ అధికారులకు చూపించారు. ప్రస్తుతం ఆ స్థలంలో రైతు మిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. అందులో రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్ పంటలు నిలువ కోసం వాడుకుంటున్నారు. ఐతే ఇక ఆ స్థలాన్ని, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖకు రాసిస్తే.. రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు.

ఇవాళ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీలకు ఈ విషయం చెప్పి స్థలానికి సంబంధించి పేపర్స్ ను అందజేశారు. అదే విధంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ను ఏర్పాటుచేయాలని రైతు కమిషన్ కోరింది. దానికి సంబంధించి ప్రైవేట్ స్థలం యాచారం బస్టాండ్ కు అనుకొనే ఉన్నట్లు కమిషన్ బృందం.. మంత్రికి వివరించారు. ఆ స్థలాన్ని సేకరించి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పలు అంశాలపై వ్యవసాయ మంత్రితో కమిషన్ చర్చించింది.

Next Story