కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటన
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది
By Knakam Karthik
కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటన
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్ మరో ముగ్గురు సభ్యుల బృందం వివరాలు సేకరిస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనంపై నివేదిక తయారు చేయనుంది. హెచ్‌సీయూ విద్యార్థులు, ఫ్యాకల్టీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ భేటీకానుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు ఆధారంగానే అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది.
కాగా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఎంపవర్డ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్ సహా మరో ముగ్గురు సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు.