సీఎం కేసీఆర్‌ విషయంలో.. బీజేపీకి షాకిచ్చిన ఈసీ

Central Election Commission has stopped BJP's campaign against CM KCR. తెలంగాణ బీజేపీకి షాక్‌ తగిలింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం

By అంజి  Published on  11 Aug 2022 3:15 PM IST
సీఎం కేసీఆర్‌ విషయంలో.. బీజేపీకి షాకిచ్చిన ఈసీ

తెలంగాణ బీజేపీకి షాక్‌ తగిలింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీని ఆదేశించింది. 'సాలు దొర - సెలవు దొర' ప్రచారంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం ఫొటోతో కూడిన పోస్టర్లు ముద్రించేందుకు బీజేపీ కోరిన అనుమతిని నిరాకరిస్తున్నట్లు ఈసీ తెలిపింది. 'సాలు దొర - సెలవు దొర' పేరుతో కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ బీజేపీ చేపట్టిన ప్రచారానికి పర్మిషన్‌ కోరూతు బీజేపీ నేతలు ఎలక్షన్‌ కమిషన్‌ను సంప్రదించారు. బీజేపీ అనుమతిని పరిశీలించిన ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు 'సాలు దొర - సెలవు దొర' విజ్ఞప్తిని తోసిపుచ్చారు.

సీఎం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు బీజేపీ అనుమతి కోరగా ఈసీ నిరాకరించింది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు ఎక్కువయ్యాయి. సెంట్రల్‌ గవర్నమెంట్‌ స్కీమ్‌లు, ప్రైమ్‌ మినిస్టర్ మోదీపై టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు చేస్తుంటే.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్‌ సందర్భంగా కూడా ఆయనపై విమర్శలతో పలువురు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో కేసీఆర్‌పైనా కూడా పలు ఆరోపణలు చేస్తూ కొన్ని చోట్ల పోస్టర్లు కనిపించాయి.

Next Story