నీరజ్.. వందేళ్ల క‌ల‌ను నిజం చేశావ్‌..! : సీఎం కేసీఆర్‌

Celebrities Wishes to Neeraj Chopra. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో తొలిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల సీఎం కేసీఆర్

By Medi Samrat  Published on  7 Aug 2021 3:01 PM GMT
నీరజ్.. వందేళ్ల క‌ల‌ను నిజం చేశావ్‌..! : సీఎం కేసీఆర్‌

టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో తొలిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్ లో వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

నీరజ్‌ చోప్రా.. ఇది అద్వితీయమైన గెలుపు. స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పసిడి పతకం తీసుకొచ్చిన నీ ప్రతిభ.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. భారతదేశం.. నీ విజయానికి సంతోషిస్తోంది. హృదయపూర్వక అభినందనలు అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్ ట్వీట్ చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. ఈరోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చిరకాలం గుర్తుంటుంది. చాలా చక్కగా రాణించాడు. ఒక ప్యాషన్‌తో తనదైన శైలిలో ఆడిన నీరజ్‌కు నా అభినందనలు అని మోదీ ట్వీట్ చేశారు.Next Story
Share it