Telangana: మహిళా ఐఏఎస్‌ను కించపరిచేలా వార్తలు..రంగంలోకి సీసీఎస్ పోలీసులు
తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడు పెంచారు.
By - Knakam Karthik |
Telangana: మహిళా ఐఏఎస్‌ను కించపరిచేలా వార్తలు..రంగంలోకి సీసీఎస్ పోలీసులు
తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఛానెల్ ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా ఐఏఎస్‌ను కించపరిచే విధంగా పలు న్యూస్ ఛానెల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా కథనాలు ప్రసారం చేశాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే 44 యూట్యూబ్ ఛానెల్స్‌పై పోలీసులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఛానెల్స్ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు సమాయత్తం అయ్యారు. ఇప్పటికే పలువురిని గుర్తించగా.. సీసీఎస్ పోలీసుల ఎంట్రీతో పలువురు యూట్యూబ్ ఛానెల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా జనవరి 8న ప్రసారం చేయబడిన మరియు ప్రచురించబడిన ఒక నివేదిక తప్పుడు, కల్పితమైన మరియు నిరాధారమైనదని పేర్కొంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. ఆ ప్రసారంలో అధికారికి మరియు ఒక రాజకీయ కార్యనిర్వాహకుడికి మధ్య వ్యక్తిగత సంబంధాన్ని సూచించే ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయని మరియు ఆమె అధికారిక పోస్టింగ్‌లను అలాంటి వాదనలతో అనుసంధానించడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
అయితే ప్రముఖ న్యూస్ ఛానెల్ ఇన్‌పుట్ ఎడిటర్ అరెస్టుతో తెలంగాణలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆయనతో పాటు అదే సంస్థకు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులను కూడా అదుపులోకి తీసుకోవడం మీడియా వర్గాల్లో కలకలం రేపింది. మరో వైపు జర్నలిస్టుల అరెస్టును హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, మీడియా గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.