సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు క‌న్నుమూత‌

ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు.

By Medi Samrat  Published on  16 Nov 2024 3:00 PM IST
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు క‌న్నుమూత‌

ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు. నవంబర్ 14న రామ్మూర్తి నాయుడుకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చేర్చారు. గత రెండు రోజులుగా వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయ‌న మరణించారు. ఈ విష‌యాన్ని హాస్పిటల్ యాజ‌మాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇదిలావుంటే.. ఇటీవలే నారా రోహిత్ నిశ్చితార్థం జరగ్గా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. ఇంత‌లోనే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు నారావారి పల్లెలో జరగనున్నట్టు సమాచారం.

మంత్రి నారా లోకేష్ ఉద‌య‌మే హైదరాబాద్ లోని హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉండగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంనకు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు మరణంతో టీడీపీ శ్రేణుల్లో, నారా వారి పల్లెలో విషాదం నెలకొంది.

Next Story