ఎమ్మెల్సీ క‌విత ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం

CBI team reaches MLC Kavitha house.ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసుకు సంబంధించి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2022 7:17 AM GMT
ఎమ్మెల్సీ క‌విత ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ క‌విత‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు హైద‌రాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. రెండు వాహ‌నాల్లో ఎనిమిది మంది అధికారుల‌ బృందం ఉద‌యం 11 గంట‌ల‌కు క‌విత ఇంటికి వ‌చ్చారు. ఈ బృందంలో మ‌హిళా అధికారులు కూడా ఉన్నారు. సీఆర్‌పీసీ 160 కింద క‌విత వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. సాయంత్రం వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగే అవ‌కాశం ఉంది.

విచార‌ణ‌కు మొద‌ట సీబీఐ డిసెంబ‌ర్ 6వ తేదీ సూచిస్తూ క‌విత‌కు లేఖ రాసింది. అయితే.. ఆ రోజు ఇత‌ర కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో 11,12,14,15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటాన‌ని క‌విత బ‌దులుఇచ్చింది. దీంతో 11న విచార‌ణ‌ చేస్తామ‌ని సీబీఐ తెలిపింది. క‌విత నివాసం వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి త‌ర‌లివ‌చ్చి సంఘీభావం తెలుపుతున్నారు. 'డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్‌.. విల్ నెయ‌ర్ ఫియ‌ర్‌'( యోధుడి కుమారై.. ఎప్పుడూ భ‌య‌ప‌డ‌దు), 'వీ ఆర్ విత్ యూ క‌విత‌క్కా'( మేము నీతోనే ఉన్నాం క‌విత‌క్కా) అంటూ క‌విత నివాస ప్రాంతంతో పాటు ప‌రిస‌రాల్లో శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


Next Story