అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు.

By Medi Samrat  Published on  14 Sept 2024 10:31 AM IST
అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై కూడి కేసు నమోదయింది. ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్ లపై కూడా కేసు నమోదు చేశారు. గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపింది. వివాదం మధ్యలోకి ప్రాంతీయత రావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలను రాజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని అరెకపూడి గాంధీ ఆరోపించారు.

అయితే ఆంధ్ర సెటిలర్లను తమ పార్టీకి దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ గా వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఏనాడు ఇబ్బందులకు గురిచేయలేదని, సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కేసీఆర్ అన్నారని పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కేసీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు గౌరవమని చెప్పారు. సెటిలర్స్ అనే పదాన్ని తాను వాడలేదని, తాను ఆంధ్రా అనే పదాన్ని వాడి ఉంటే అది తనకు, గాంధీకి వ్యక్తిగతమని కౌశిక్ రెడ్డి చెప్పారు.

Next Story