కరీంనగర్‌లో వీధికుక్కను చంపిన ముగ్గురిపై కేసు

Case against trio for killing a stray dog in Karimnagar. వీధికుక్కను చంపిన ముగ్గురు వ్యక్తుల కోసం కరీంనగర్ పోలీసులు గాలిస్తున్నారు.

By Medi Samrat  Published on  20 Aug 2022 8:15 PM IST
కరీంనగర్‌లో వీధికుక్కను చంపిన ముగ్గురిపై కేసు

వీధికుక్కను చంపిన ముగ్గురు వ్యక్తుల కోసం కరీంనగర్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 15న కొత్తపల్లి మండలం సంగెం చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు వీధికుక్కను కొట్టి చంపారు. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. కుక్కను చంపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హైదరాబాద్‌లోని యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు పృథ్వీ పన్నీరు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి కూడా తెలియజేశారు. మేనకా గాంధీ శుక్రవారం రాత్రి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణకు ఫోన్‌ చేసి విచారణ చేపట్టాల్సిందిగా అభ్యర్థించినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేయాల్సిందిగా కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. సెక్షన్ 429 ఐపిసి కింద కేసు నమోదు చేయబడింది. దుండగులను గుర్తించి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.




Next Story