తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి సబితా రెడ్డి ఫస్ట్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://tsbienew.cgg.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాల విషయంలో ఏమైనా తేడాలు ఉన్నాయని అనిపిస్తే విద్యార్థులు 14416 నంబర్ కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 10 నుంచి మే 16 వరకు రీ కౌంటింట్ అండ్ రీ వెరిఫికేషన్ కు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని మంత్రి సబితా రెడ్డి తెలిపారు. జూన్ 04వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని సబితా రెడ్డి తెలిపారు. ఈ సారి ఎంసెట్ లో వెయిటేజ్ ను తొలగించామని.. ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెస్ స్కోర్ తో ర్యాంకులను ప్రకటిస్తామని తెలిపారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండవ సంవత్సరం పరీక్షలకు 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.