తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. వాళ్లకి బుద్ధి చెప్తాం: కేటీఆర్‌

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు.

By అంజి  Published on  5 Aug 2024 6:53 AM GMT
By elections, Telangana, KTR

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. వాళ్లకి బుద్ధి చెప్తాం: కేటీఆర్‌

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. న్యాయ నిపుణులతో పార్టీ సీనియర్లు చర్చిస్తున్నారని, త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతలపై స్పష్టత వస్తుందని, వారిపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని... పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.

ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story